![]() |
![]() |

ఇండస్ట్రీలో పవన్ కల్యాణ-ఆలీ ఎంతో మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈ మధ్య కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఇక ఈ విషయం మీద ఆలీతో సరదాగా షోలో "మీకూ పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ? అని సుమ అడిగేసరికి ”నాకు పవన్ కు మధ్య గ్యాప్ లేదు. దాన్ని కొంతమంది క్రియేట్ చేశారు. మా అమ్మాయి పెళ్లికి కూడా వస్తా అన్నారు. కానీ ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయారు” అని ఆలీ చెప్పారు.
పెళ్ళికి ముందు ఆలీ గారికి ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయ్ అని సుమ అడిగేసరికి "ఆలీ సిగ్గుపడుతూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారు. చిన్నప్పుడు ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. ఒకరోజు వర్షంలో చున్నీ నెత్తి మీద కప్పుకుని తడుస్తూ వస్తోంది. అప్పుడు నేను ఒక ఇంపోర్టెడ్ గొడుగుని కొని మా చెల్లికి ఇచ్చి ఆమెకు ఇవ్వమని చెప్పాను. అలా ఆ గొడుగు తీసుకున్న ఆ అమ్మాయి రెండో రోజు వర్షం లేకపోయినా నా కోసం గొడుగు వేసుకుని వెళ్ళింది." అని నవ్వుతూ చెప్పారు ఆలీ.
![]() |
![]() |